: జమ్మూకాశ్మీర్ ఎన్నికల్లో ఒంటరి పోరే: కాంగ్రెస్ నేత అంబికా సోనీ
జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగనుందని ఆ పార్టీ సీనియర్ నేత అంబికా సోనీ చెప్పారు. జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ గడువు రానున్న జనవరిలో ముగియనుంది. నిన్నటి సాధారణ ఎన్నికల్లో దేశంలోని మెజార్టీ ప్రాంతాల్లో ఆ పార్టీ ఘోర పరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే. అయితే జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఆరు నెలల సమయమున్న నేపథ్యంలో ఆలోగా బలం పుంజుకుని ఎన్నికల్లో సత్తా చాటాలని పార్టీ భావిస్తోంది. పక్కా ప్రణాళిక ప్రకారం ఎన్నికల బరిలోకి దిగాలని భావిస్తున్న పార్టీ, రాష్ట్రంలోని మొత్తం 87 స్థానాల్లో పోటీకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది.