: మమ్మల్ని వెంకన్న దర్శనానికి పంపించండి సారూ!
తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని టీటీడీ అధికారులు రద్దు చేశారు. దీంతో, స్పెషల్ దర్శనం క్యూలైన్ లో అనుమతించాలంటూ భక్తులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఆలయ డిప్యూటీ ఈవో, విజిలెన్స్ సిబ్బందితో భక్తులు వాగ్వాదానికి దిగారు. సాధారణంగా, భక్తుల రద్దీ ఎక్కువైనప్పుడు తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని టీటీడీ రద్దు చేయడం పరిపాటే.