: అమ్మవారికి బంగారు బోనం సమర్పించుకున్న కేసీఆర్
హైదరాబాదు లాల్ దర్వాజ సింహవాహిని ఆలయంలో కొలువై ఉన్న మహంకాళి అమ్మవారికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు బోనం సమర్పించారు. ఇవాళ సతీసమేతంగా ఆయన అమ్మవారిని దర్శించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బంగారు బోనం సమర్పిస్తామని గతంలో ఆలయ కమిటీ మొక్కుకుంది. దీంతో, తెలంగాణ ఏర్పడిన నేపథ్యంలో, బంగారు బోనాన్ని ఆలయ కమిటీ తయారుచేయించింది.