: దర్శకుడు ఎన్. శంకర్ 'నంది' వితరణ
జైబోలో తెలంగాణ చిత్రంతో నంది అవార్డులు గెలుచుకున్న దర్శకుడు ఎన్. శంకర్ తన ఔన్నత్యాన్ని చాటుకున్నారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమర వీరుల కుటుంబాలకు నేడు విరాళం ప్రకటించారు. 2011 ఏడాదికి ఉత్తమ దర్శకుడు, ఉత్తమ జాతీయ సమైక్యతా అవార్డుల రూపేణా ప్రభుత్వం అందజేసిన నగదు రూ. 1.05 లక్షలను అమర వీరుల కుటుంబాల సంక్షేమం కోసం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్షణికావేశంతో నిర్ణయాలు తీసుకొని, బలవన్మరణాలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. సమానత్వం ఉన్న తెలంగాణ కోసం అందరూ ఉద్యమించాలని శంకర్ పిలుపునిచ్చారు.