: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కామినేని శ్రీనివాస్


ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలకు ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చేరుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న కామినేనికి టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయనకు తీర్థప్రసాదాలను అందజేశారు. దర్శనానంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ... పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. మందులు ఉచితంగా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News