: లష్కర్ బోనాలు షురూ
హైదరాబాదు లాల్ దర్వాజాలోని శ్రీ సింహవాహిని మహంకాళీ అమ్మవారి ఆలయంలో బోనాల పండుగ సందడి మొదలైంది. ఇవాళ వేకువజాము నుంచే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. మహిళలు బోనాలతో అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. కుండలో కొత్తబియ్యం, పాలు, బెల్లంతో వండిన నైవేద్యాన్ని బోనంగా వ్యవహరిస్తారు. కుండపై దీపాన్ని వెలిగించి, వేపాకులతో అలంకరించి నెత్తిన పెట్టుకుని మహిళలు ఆలయానికి వచ్చి, అమ్మవారికి బోనాన్ని సమర్పించడం ఆనవాయతీగా వస్తోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తెలంగాణ ప్రభుత్వం 6 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసింది. ప్రభుత్వం ఈసారి బోనాల పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.