: అక్రమ్ తో అనుబంధంపై పెదవి విప్పిన సుస్మిత


పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ తో వివాహం వార్తలను ఖండించిన మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ తమ అనుబంధంపై వివరణ ఇచ్చింది. తమ మధ్య ఉన్నది కేవలం స్నేహబంధమే అని సుస్మిత తెలిపింది. అక్రమ్ జీవితంలో ఓ అద్భుతమైన మహిళ ఉందని, ఆమె చనిపోయిన నేపథ్యంలో ఆయన ఎప్పటికీ ఒక్కడిగానే ఉంటారని ఈ బాలీవుడ్ నటి పేర్కొంది. కాగా, పెళ్ళి పుకార్లతో తమ ఏకాంతానికి, గౌరవానికి భంగం కలిగించవద్దని సుస్మిత విజ్ఞప్తి చేసింది.

ఈ విషయమై అక్రమ్ కూడా స్పందించాడు. తన పిల్లల కోసం ఓ ఏడాది పాటు ఐపీఎల్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని, దీంతో, అందరూ సుస్మితను పెళ్ళాడేందుకే విరామం తీసుకుంటున్నట్టు ఊహాగానాలు అల్లేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. తన జీవితంలో ఇంకెవ్వరినీ పెళ్ళాడే ఉద్ధేశం లేదని అక్రమ్ స్పష్టం చేశాడు.

  • Loading...

More Telugu News