: యోగా, వ్యాయామం చేస్తే... ఉండొచ్చు హాయిగా!
యోగా, వ్యాయామం చేస్తే హాయిగా జీవనాన్ని సాగించవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. వ్యాకులతను తగ్గించేందుకు వ్యాయామం, విశ్రాంతి దోహదపడుతుందని కెనడాలోని క్వీన్స్ వర్శిటీ క్లినికల్ సైకాలజీ విద్యార్థి ఆడమ్ హీనన్ చెబుతున్నారు. యోగా, వ్యాయామం వల్ల ప్రపంచాన్ని అర్థం చేసుకునే దృక్పథం అలవడుతుందంటున్నారు. దాంతో ప్రతికూల దృక్పథంలో మార్పు వస్తుందని ఆడమ్ అంటున్నారు. వ్యాకులత, ఆతృత, బెంగ కలిగిఉన్న వారికి ఇది ఎంతో ఉపయోగకరమని చెప్పారు.