: రేపు సాధారణ సెలవు ప్రకటించిన టీ-ప్రభుత్వం
హైదరాబాదులో సింహవాహిని శ్రీమహంకాళి బోనాల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సోమవారం సాధారణ సెలవు (జనరల్ హాలిడే) ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రతియేటా నగరంలో బోనాలు జరిగే ప్రాంతాల్లో విద్యాసంస్థలు స్థానికంగా ఉండే పాఠశాలలను మూసివేయడం ఆనవాయతీగా వస్తోంది. జనరల్ హాలిడేగా ప్రకటించినందున రేపు హైదరాబాదు జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు పనిచేయవని కలెక్టర్ ముఖేష్ కుమార్ మీనా ప్రకటించారు. ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించిన నేపథ్యంలో సోమవారం నిమ్స్ లో ఔట్ పేషంట్ విభాగాలు పనిచేయవని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మిగతా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, వ్యాపార సముదాయాలు యథావిధిగా పనిచేస్తాయి.