: రవీంద్రభారతిలో మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఫెస్టివల్
హైదరాబాద్ రవీంద్రభారతిలో ఆదివారం సాయంత్రం జరిగిన 'మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఫెస్టివల్ 2014' కార్యక్రమం వీక్షకులను ఆకట్టుకుంది. ప్రముఖ కళాకారిణి వింజమూరి సుజాత బృందం కృష్ణుని వేషధారణలో చేసిన నృత్య ప్రదర్శన ఆహూతులను అలరించింది. అనంతరం ప్రముఖ గాయని బాంబే జయశ్రీ సంగీత కచేరీ జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ ప్రభుత్వ సలహాదారు రమణాచారి వింజమూరి సుజాత, బాంబే జయశ్రీలను సత్కరించారు.