: కర్ణాటక ప్రభుత్వం దూకుడు... పోలీసు బందోబస్తుతో నేటి నుంచి ఆనకట్ట ఎత్తు పెంపు
కర్ణాటక ప్రభుత్వం మరోసారి ఏకపక్షంగా నీటి వనరులను కొల్లగొట్టడానికి ఉపక్రమించింది. కర్నూలు జిల్లా రైతులకు సాగునీటిని అందించే ఆర్డీఎస్ డ్యాం ఆనకట్ట ఎత్తును పెంచే కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి ప్రారంభించనుంది. కర్నూలు జిల్లా రైతుల నుంచి పొంచి ఉన్న ఆందోళనల రీత్యా... ఆర్డీఎస్ డ్యామ్ ఎత్తు పెంచేందుకు భద్రత కల్పించాలని రాయచూర్ ఎస్పీని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. అయితే, కర్ణాటక ప్రభుత్వ నిర్ణయంపై కర్నూలు జిల్లా రైతులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఆనకట్ట ఎత్తు పెంచే పనులను అడ్డుకుని తీరుతామని... పోలీసులను సైతం లెక్క చేయమని కర్నూలు జిల్లా రైతులు అంటున్నారు. కర్ణాటక నిర్ణయంతో జిల్లా రైతులు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటారని వాపోతున్నారు.