: తెలంగాణ స్థానికతపై పోరాటానికి సిద్ధమైన ఆంధ్రప్రదేశ్ అఖిలపక్షం


విద్యార్థుల గుండెల్లో గుబులు రేపుతున్న తెలంగాణ స్థానికత అంశంపై ఆంధ్రప్రదేశ్ అఖిలపక్షం పోరాటం చేయాలని నిర్ణయించింది. హైదరాబాదులో ఏపీ అఖిలపక్షం సమావేశం ముగిసిన సందర్భంగా మంత్రులు గంటా, రావెల కిషోర్ బాబు మాట్లాడుతూ, 1956 ను స్థానికతకు ప్రామాణికంగా నిర్ణయించడం సరికాదని అన్నారు. ఈ విధానం ఉద్యోగాలు, నివాసాలు వంటి వాటికి విస్తరించక ముందే స్పష్టత రావాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు. స్థానికత అంశంపై రాజకీయ పక్షాలన్నీ ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని నిర్ణయించామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అఖిలపక్షం న్యూఢిల్లీ వెళ్లి జాతీయ స్థాయిలో స్థానికతపై స్పష్టత తీసుకురావాలని తీర్మానించామని చెప్పారు. స్థానికతపై అవసరమైతే న్యాయపోరాటానికి కూడా వెనుకాడే ప్రసక్తి లేదని వారు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, శ్రీనివాసులు, బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు, ఉన్నత విద్యాశాఖాధికారులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News