: ఎస్పీపై కక్షకట్టిన కేంద్రమంత్రి!
కాంగ్రెస్ నేత, కేంద్ర ఉక్కుశాఖ మంత్రి బేణి ప్రసాద్ వర్మ సమాజ్ వాది పార్టీపై చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన కక్ష కట్టినట్టే కనబడుతోంది. ఆ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని గతంలో సంచలన వ్యాఖ్యలు చేశారు బేణి. తాజాగా మరోసారి తనదైన శైలి వ్యాఖ్యలు చేసి అందరి దృష్టినీ ఆకర్షించారు. లోక్ సభ ఎన్నికల ఫలితాల అనంతరం, ఎస్పీ ఆధ్వర్యంలోని యూపీ సర్కారు కుప్పకూలుతుందని జోస్యం చెప్పారు. లక్నోలో విలేకరులతో మాట్లాడిన మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇదెలా సాధ్యమని అడగ్గా.. 'చూస్తుండండి... మీకే తెలుస్తుంద'ని బేణి నవ్వుతూ సమాధానమిచ్చారు.