: ప్రతి నియోజకవర్గానికి 10 వేల దీపం కనెక్షన్లు ఇస్తాం: టీ మంత్రి ఈటెల


తెలంగాణలోని ప్రతి ఇంటిలో గ్యాస్ కనెక్షన్ ఉండేలా చూస్తామని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి 10 వేల చొప్పున దీపం కనెక్షన్లను మంజూరు చేస్తామని వెల్లడించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని స్పష్టం చేశారు. వికలాంగులు, వితంతువులు, వృద్ధుల పింఛన్లను దసరా నుంచి ఇస్తామని తెలిపారు. కరీంనగర్ జిల్లాలో 'మన ఊరు-మన ప్రణాళిక' కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News