: ఏపీ సచివాలయంలో రాజధాని కోసం హుండీల ఏర్పాటు


రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం అవసరమైన నిధుల సేకరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నానా తంటాలు పడుతోంది. నిధుల సేకరణకు ఎన్ని అవకాశాలున్నాయో అన్నింటినీ వినియోగించుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా హైదరాబాదులోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని ఎల్-బ్లాకులో విరాళాల కోసం మూడు హుండీలను ఏర్పాటు చేశారు. ఈ హుండీలపై 'ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణానికి విరాళాల నిమిత్తం' అని ప్రింట్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు పలువురు ఉన్నతాధికారులు ఈ బ్లాకులోనే ఉంటారు. ఈ నేపథ్యంలో, నిత్యం ఈ బ్లాకుకు అనేక మంది సందర్శకులు వస్తుంటారు. ఇక్కడకు విచ్చేసే వారు రాజధాని నిర్మాణం నిమిత్తం విరాళాలు వేస్తారనే ఆలోచనతోనే హుండీలను ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News