: తెలంగాణ బస్సు ఆపరేటర్లను ప్రోత్సహిస్తాం: మంత్రి మహేందర్ రెడ్డి
తెలంగాణలో కొత్త వోల్వో బస్సులతో రవాణా సదుపాయాలను మరింత మెరుగుపరుస్తామని టీ రవాణాశాఖ మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. ఈరోజు రవాణాశాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, హైదరాబాదులో 80 కొత్త వోల్వో బస్సులను ప్రవేశపెడతామని... వరంగల్ జిల్లాకు 30 బస్సులు, కరీంనగర్ జిల్లాకు 20 బస్సుల చొప్పున కొనుగోలు చేస్తామని చెప్పారు. ప్రతి గ్రామానికి బస్సు వెళ్లేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తెలంగాణ బస్సు ఆపరేటర్లను ప్రోత్సహిస్తామని వెల్లడించారు.