: ఆ క్షిపణి భారత నావికాదళానిదేనా?
మలేసియా విమానాన్ని కూల్చేందుకు ఉక్రెయిన్ వేర్పాటువాదులు వినియోగించిన క్షిపణి భారత నావికా దళం కోసం తయారు చేసినదేననే వార్తలు శనివారం అంతర్జాతీయ మీడియాలో వెలుగు చూశాయి. ఐఎన్ఎస్ విక్రమాదిత్య తరహా నౌకలకు రక్షణ కల్పించే నిమిత్తం భారత్ తయారు చేసిన ‘ష్టిల్’ రకానికి చెందిన క్షిపణినే ఉక్రెయిన్ వేర్పాటువాదులు గురువారం నాటి దాడిలో వినియోగించారని తెలుస్తోంది. ఈ క్షిపణినే నాటో ‘గ్రిజ్లీ’గా పిలుస్తోంది. 5.5 మీటర్ల పొడవు, 700 కిలోల బరువుండే ఈ క్షిపణి, 25 కిలో మీటర్ల దూరంలో ఉండే లక్ష్యాలను కూడా ఛేదిస్తుందట.