: పద్మనాభ స్వామి ఆలయంలో రాష్ట్రపతి పూజలు


రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ ఉదయం పద్మనాభస్వామిని దర్శించుకున్నారు. రెండ్రోజుల కేరళ పర్యటన ముగించుకున్న అనంతరం రాష్ట్రపతి తిరువనంతపురంలోని పద్మనాభస్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సమయంలో ఆయన వెంట కేరళ గవర్నర్ షీలా దీక్షిత్ కూడా ఉన్నారు. ఆలయ ఈవో కె.ఎన్. సతీశ్ తదితర అధికారులు రాష్ట్రపతికి ఘనస్వాగతం పలికారు. దాదాపు 40 నిమిషాల పాటు ఆలయంలో గడిపిన ఆయన అటుపై తమిళనాడులోని తిరుచిరాపల్లికి పయనమయ్యారు.

  • Loading...

More Telugu News