: కూల్చివేతలను ఓల్డ్ సిటీలో ఎందుకు చెయ్యడం లేదు: లక్ష్మణ్


అక్రమ కట్టడాల కూల్చివేత విషయంలో టీఆర్ఎస్ సర్కార్ వైఖరిపై తెలంగాణ బీజేపీ శాసనసభా పక్ష నేత కె.లక్ష్మణ్ ధ్వజమెత్తారు. ఈ కూల్చివేతలను కేసీఆర్ కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితం చేశారని ఆయన వ్యాఖ్యానించారు. ఓల్డ్ సిటీలో అక్రమనిర్మాణాల కూల్చివేతలను ఇంకా ఎందుకు ప్రారంభించలేదని ఆయన తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మజ్లిస్ ప్రభావిత ప్రాంతాల్లో అక్రమ కట్టడాలను కూల్చేందుకు కేసీఆర్ సాహసం చెయ్యడం లేదని ఆయన మండిపడ్డారు. తప్పుడు అనుమతులు ఇచ్చిన ఒక్క అధికారిపై కూడా టీ సర్కార్ చర్యలు తీసుకోలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News