: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి త్వరలోనే పదేళ్ల పాటు ప్రత్యేక ప్రతిపత్తి: వెంకయ్య


ఆంధ్రప్రదేశ్ కు త్వరలోనే ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తామని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. శుక్రవారం ఏపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల శిక్షణా తరగతుల కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ కు కచ్చితంగా పదేళ్ల పాటు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఏదైనా చెయ్యాలనుకుంటే... ఎవరో ఏదో అనుకుంటారని తాము వెనుకంజ వేయబోమని, ఏ రాష్ట్రానికి ఏది అవసరమో అది కచ్చితంగా చేస్తామని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News