: నేడు నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు నెల్లూరు రానున్న ముఖ్యమంత్రి సాయంత్రం 5.30 గంటలకు తిరిగి హైదరాబాద్ వెళతారు. రెండు గంటల పాటు నెల్లూరులో ఉండనున్న చంద్రబాబు, స్థానికంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభించడంతో పాటు జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలోనూ ఆయన పాల్గొంటారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో జిల్లా పోలీసులు భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆయన పాల్గొనే కార్యక్రమాల్లో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొననున్నారు.

  • Loading...

More Telugu News