: ఇజ్రాయెల్ కు తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన హమాస్


ఇజ్రాయెల్-పాలస్తీనాకు చెందిన హమాస్ ల మధ్య పోరు తీవ్ర రూపం దాలుస్తోంది. భారీ ఎత్తున మందుగుండు, ట్యాంకులు, రాకెట్లతో ఇజ్రాయెల్ గాజా వైపు దూసుకుపోతోంది. గాజాను ఆక్రమిస్తామని ఇజ్రాయెల్ సైనికాధికారి ప్రకటించారు. దీనిపై హమాస్ తీవ్రంగా స్పందించింది. గాజాను ఇజ్రాయెల్ ఆక్రమిస్తుంటే తాము చూస్తూ ఊరుకోమని హమాస్ ప్రతినిధి ఫజ్వీ బర్హుమ్ హెచ్చరించారు. ఇజ్రాయెల్ సైనికుల్ని గాజా బురదలోకి తొక్కేస్తామని తీవ్ర స్వరంతో అన్నారు. గాజా ముట్టడికి ఇజ్రాయెల్ ప్రయత్నిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు.

  • Loading...

More Telugu News