: ప్రధాని అభ్యర్దిగా బీజేపీ అగ్రనేతకు పెరుగుతున్న మద్ధతు!
రానున్న లోక్ సభ ఎన్నికలకు ప్రధాని అభ్యర్ధి ఎంపికపై బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పీఎం అభ్యర్ధిగా గుజరాత్ ముఖ్యమంత్రి మోడీయేనని జరుగుతున్న ప్రచారాన్ని వ్యతిరేకిస్తున్న పలువురు.. బీజేపీ అగ్రనేత పేరును తెరపైకి తెస్తున్నారు. ఈ క్రమంలో మోడీని పక్కన పెట్టిన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు బీజేపీ అగ్రనేత లాల్ క్రిష్ణ అద్వానీని ప్రధాని పీఠంపై కూర్చోపెట్టాలని ఉవ్విళ్లూరుతున్నాయి.
ఇందుకు ఊతమిస్తూ ఎన్డీఏ భాగస్వామి శిరోమణి అకాళీదల్ (ఎస్ఏడి) ప్రధాని అభ్యర్ధిగా అద్వానీకే మద్ధతు పలికింది. దీనిపై ఆ పార్టీ నేత నరేష్ గుజ్రాల్ మాట్లాడుతూ... అద్వానీ పేరుకు ఎవరూ అడ్డుచెప్పరన్నారు. ఎన్డీఏలో సీనియర్ నేత, అనుభవం ఉన్ననేత ఆయనేనని పేర్కొన్నారు. కాగా, ప్రధాని అభ్యర్ధి ఎంపికపై బీజేపీకి డిసెంబర్ వరకు సమయం ఇచ్చిన జేడీ(యు) కూడా అద్వానీకే మొగ్గు చూపుతుందనడంలో సందేహం లేదు.