: సెలబ్రిటీస్ కోసం ఫేస్ బుక్ న్యూ యాప్
ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ 'మెన్షన్స్' పేరుతో ఓ కొత్త అప్లికేషన్ ను తీసుకొచ్చింది. ఫేస్ బుక్ గుర్తించిన లేదా ధృవీకరించిన సెలబ్రిటీల కోసమే ఈ యాప్ ను తీసుకొచ్చినట్లు తెలిపింది. దాంతో, తమ ఫేస్ బుక్ పేజీని ప్రముఖులు సక్రమంగా నిర్వహించుకునేందుకు ఉపయోగపడుతుందని వెల్లడించింది. అంతేగాక తమ ఫ్యాన్స్, ఇతరులతో సులభంగా చాట్ చేయవచ్చని, కావాలనుకున్న పోస్టులు చేసుకోవచ్చని వివరించింది. యాప్ ద్వారా పూర్తి రక్షణ ఉంటుందని పేర్కొంది. నటులు, క్రీడాకారులు, మ్యుజీషియన్స్, ఇతర ప్రముఖుల కోసమే ప్రత్యేకంగా అప్లికేషన్ ను రూపొందించినట్లు ఫేస్ బుక్ తెలిపింది.