: కోల్ స్కాంపై ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు సుప్రీం ఆదేశం


బొగ్గు కుంభకోణం కేసులో విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన కోర్టు, స్కాంకు సంబంధించి నమోదైన కేసులన్నింటినీ ఈ కోర్టులో విచారణ చేయాలని సూచించింది. కేసుల విచారణకు నియమించిన లాయర్ల వివరాలను న్యాయస్థానానికి సమర్పించాలని పేర్కొంది. అటు కేసులో విచారణను వేగవంతం చేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది.

  • Loading...

More Telugu News