: ప్రధాని మోడీకి అలహాబాద్ హైకోర్టు నోటీసు
కాంగ్రెస్ నేత అజయ్ రాయ్ దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా అలహాబాద్ హైకోర్టు ప్రధానమంత్రి నరేంద్రమోడీకి నోటీసు ఇచ్చింది. 2014 లోక్ సభ ఎన్నికల్లో వారణాసి నుంచి మోడీ ప్రత్యర్థిగా పోటీ చేసిన అజయ్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే, ఎన్నికల అఫిడవిట్ లో మోడీ తన భార్య యశోదా బెన్ కు సంబంధించిన పాన్ కార్డు వివరాలు వెల్లడించకుండా ఖాళీగా ఉంచారంటూ పిటిషన్ వేశారు. అంతేకాక ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం లోక్ సభ ఎన్నికల్లో కేవలం రూ.70 లక్షలే ఖర్చు పెట్టాలన్న నిబంధనను పక్కనబెట్టి మోడీ ప్రచారంకోసం కోట్లు ఖర్చుపెట్టారని ఆరోపించారు.