: దుర్గ గుడి ముందు ట్రాఫిక్ కష్టాలకు త్వరలో తెర
విజయవాడలోని దుర్గ గుడి ముందు ట్రాఫిక్ అవాంతరాలు, ప్రమాదాలను నివారించేందుకు త్వరలోనే రోడ్ డివైడర్ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని కేంద్ర రవాణా, రహదారుల శాఖా సహాయ మంత్రి సర్వే సత్యన్నారాయణ చెప్పారు. అలాగే 9వ నంబర్ జాతీయ రహదారిపై కుమ్మరిపాలెం సెంటర్ నుంచి ఫ్లై ఓవర్ నిర్మాణం చేపడతామన్నారు. ఇందుకోసం 36 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. అయితే దీనికి సంబంధించి తాజా అంచనాలపై అధికారులతో చర్చించాల్సి ఉందన్నారు. తన హాయంలోనే ఈ పనులు ప్రారంభమవుతాయని హామీ ఇచ్చారు.