: హఫీజ్ సయీద్ ను అరెస్టు చేయలేము: పాక్ రాయబారి
ముంబయి పేలుళ్ల ప్రధాన సూత్రదారి హఫీజ్ సయీద్, జర్నలిస్టు వేద్ ప్రతాప్ వైదిక్ సమావేశంపై తమకెలాంటి సమాచారం లేదని భారత్ లో పాకిస్థాన్ రాయబారి అబ్దుల్ బాసిత్ తెలిపారు. దీనిపై ఎలాంటి సాక్ష్యం కూడా లేదు కాబట్టి, జమాత్-ఉద్-దవా చీఫ్ ను తాము అరెస్టు చేయలేమని వెల్లడించారు. ఈ మేరకు న్యూఢిల్లీలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అది ఇద్దరు ప్రైవేటు వ్యక్తుల వ్యక్తిగత సమావేశం అని, అంతకంటే ఏం లేదని పేర్కొన్నారు.