: మంటలను ఆర్పేందుకు వెళ్లి... చిక్కుకుపోయిన ఫైర్ సిబ్బంది
ముంబయిలోని అంధేరి ప్రాంతంలో ఉన్న 22 అంతస్థుల భవనంలో ఇవాళ ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. భవనంలోని 21వ అంతస్థులో మంటలు చెలరేగి... చూస్తుండగానే 20, 22 అంతస్తులకు వ్యాపించాయి. పలు కార్యాలయాలున్న ఈ భవనంలో ఉదయం 11 గంటల ప్రాంతంలో ప్రమాదం జరగడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. భవనంలోని ఉద్యోగులను అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా బయటకు పంపించివేశారు. అయితే, మంటలను ఆర్పేందుకు వెళ్లిన 30 మంది అగ్నిమాపక సిబ్బంది 22వ అంతస్తులో చిక్కుకుపోయారు. వారిని కాపాడేందుకు అధికారులు హెలికాప్టర్ సహాయం తీసుకుంటున్నారు.