: వైకాపా రెబల్ అభ్యర్థులకు ప్రత్యేక సీట్లు కేటాయించండి: హైకోర్టు
ఈ నెల 20న నెల్లూరు జిల్లాపరిషత్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక జరగనున్న నేపథ్యంలో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వైఎస్ఆర్సీపీకి చెందిన ఎనిమిది మంది రెబల్ అభ్యర్థులను ఏ పార్టీ (టీడీపీ, వైకాపా)కీ చెందని స్థానాల్లో కూర్చోబెట్టాలని ... అందుకోసం వారికి ప్రత్యేక సీట్లను కేటాయించాలని ఆదేశించింది. వైకాపా రెబల్ అభ్యర్థులు టీడీపీకి మద్దతు తెలుపుతున్న సంగతి తెలిసిందే. కోర్టు తీర్పుతో జడ్పీ ఎన్నిక మరింత ఆసక్తికరంగా మారింది.