: ఆ విమానంలో పది దేశాలకు చెందిన పౌరులున్నారు


ఉక్రెయిన్, రష్యా సరిహద్దుల్లో కూలిపోయిన మలేసియా విమాన ప్రమాదంలో పది దేశాలకు చెందిన పౌరులు ఉన్నట్టు సమాచారం. మృతుల్లో అత్యధికులు నెదర్లాండ్ దేశస్థులని మలేసియా విమానయాన ఉన్నతాధికారి తెలిపారు. 154 మంది డచ్ పౌరులతో పాటు 27 మంది ఆస్ట్రేలియన్లు, 23 మంది మలేసియన్లు, 11 మంది ఇండోనేషియా దేశీయులు, ఆరుగురు బ్రిటన్ కు చెందిన వారు, నలుగురు జర్మన్లు, మరో నలుగురు బెల్జియం దేశస్థులు, ముగ్గురు ఫిలిప్పీనియన్లు, ఒకరు కెనడా పౌరులని ఆయన వెల్లడించారు. మరో 47 మంది మృతుల స్వస్థలాలపై నిర్ణయానికి రావాల్సి ఉంది. నెదర్లాండ్స్ చరిత్రలో ఇదొక పెను విపత్తు అని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి అని నెదర్లాండ్స్ లో మలేసియా రాయబారి ఎఫ్ మహ్మద్ తెలిపారు.

  • Loading...

More Telugu News