: ఢిల్లీ రాష్ట్ర బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశపెట్టిన జైట్లీ
2014-15 ఆర్థిక సంవత్సరానికి గాను ఢిల్లీ రాష్ట్ర బడ్జెట్ ను లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టారు. బడ్జెట్ మొత్తం విలువ రూ. 36,776 కోట్లు. ఈ బడ్జెట్లో విద్యకు పెద్దపీట వేసి రూ. 2,400 కోట్లు కేటాయించారు. పవర్ సబ్సిడీకి రూ. 260 కోట్లు కేటాయించారు ఆర్థికమంత్రి. బడ్జెట్లో కొత్త పన్నులేవీ ప్రతిపాదించలేదు.