: అనుభవాల సారాన్ని పంచిన వెంకయ్య


ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతుల్లో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడారు. ఈ సందర్భంగా తన అనుభవాల సారాన్ని శాసనసభ్యులకు పంచే ప్రయత్నం చేశారు. తన రాజకీయజీవితం తొలినాళ్ళలో గురువు తెన్నేటి విశ్వనాథాన్ని స్ఫూర్తిగా తీసుకున్నానని తెలిపారు. సభ ఆరంభం నుంచి ముగింపు వరకు ఎంత అప్రమత్తంగా ఉండాలన్నది ఆయన్ను చూసే నేర్చుకున్నానని తెలిపారు. సభ వాయిదా పడినప్పుడో, విరామం దొరికినప్పుడో లైబ్రరీకి వెళ్ళి 1952లో ప్రకాశం పంతులు, తెన్నేటి, గరిమెళ్ళ తదితరుల ప్రసంగాలను పరిశీలించేవాణ్ణని గుర్తు చేసుకున్నారు. నేటి సభ్యులు కష్టపడే మనస్తత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. కోరికలకు దూరంగా ఉండాలని బోధించారు.

  • Loading...

More Telugu News