: మావాళ్ళే.. పొరబాటున కూల్చారేమో!: ఉక్రెయిన్ రెబల్స్ కమాండర్
మలేసియా విమానాన్ని పేల్చేసింది తిరుగుబాటుదారులే అయివుంటారని, అయితే పొరపాటుగానే ఈ దుర్ఘటన చోటుచేసుకుని ఉంటుందని ఉక్రెయిన్ తిరుగుబాటు దళాల కమాండర్ ఇగోర్ స్ట్రెల్కోవ్ ప్రకటించారు. ఉక్రెయిన్ సైనిక దళాలకు చెందిన విమానంగా భావించి మలేసియా విమానాన్ని వేర్పాటువాదులు పేల్చేశారని ఆయనను ఊటంకిస్తూ సోషల్ మీడియా వెబ్ సైట్ ఒకటి పేర్కొంది. ‘ఇటీవలే ఉక్రెయిన్ సైనికులు వెళుతున్న ఓ చిన్న విమానాన్ని కూల్చేశాం. అసలు మా భూభాగం మీదుగా మీ విమానాలు తిరగకుండా జాగ్రత్త వహించండి అంటూ వారికి ఇప్పటికే సూచించాం. అయినా మా భూభాగం మీదుగా వచ్చినందుకే ఆ దాడి చేశాం. తాజాగా భారీ సంఖ్యలో సైనికులను తీసుకెళుతున్నట్లు భావించిన వేర్పాటువాదులు, మలేసియా విమానాన్ని పేల్చేశారు’ అని ఇగోర్ తెలిపారు.