: ముదిరిన జడేజా, ఆండర్సన్ వివాదం... ఐసీసీ విచారణ


రవీంద్ర జడేజా, ఆండర్సన్ వివాదం పలు మలుపులు తిరుగుతోంది. తొలి టెస్టు సందర్భంగా ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాను జాతి వివక్ష వ్యాఖ్యలు చేసి నెట్టాడు. దీనిని చిన్న ఘటనగా తొలి రోజు కొట్టిపడేసిన బీసీసీఐ జడేజా నుంచి విషయం తెలుసుకున్న తరువాత ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం ఐసీసీకి ఫిర్యాదు చేసింది. చిన్న ఘటన అన్న భారత్ ఐసీసీకి ఫిర్యాదు చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు, జడేజా ఆండర్సన్ ను రెచ్చగొట్టాడంటూ ఐసీసీకి ఫిర్యాదు చేసింది. దీంతో ఐసీసీ ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించింది. విచారణాధికారిగా ఆస్ట్రేలియాకు చెందిన గార్డన్ లూయిస్ ను నియమించింది. రెండో టెస్టు ముగిసిన తరువాత ఈ నెల 22న లూయిస్ విచారణ చేపట్టనున్నారు.

  • Loading...

More Telugu News