: బదౌన్ ఘటన మృతదేహాలకు మళ్లీ శవపరీక్ష
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బదౌన్ ఘటనపై స్థానిక న్యాయస్థానాన్ని సీబీఐ ఆశ్రయించింది. ఉత్తరప్రదేశ్ లోని బదౌన్ లో అత్యాచారం, హత్యలకు గురైన ఇద్దరు దళిత బాలికల మృతదేహాలకు మరోసారి శవపరీక్షలు నిర్వహించాలని సీబీఐ నిర్ణయించింది. దీంతో ఈ నెల 20న మరోసారి శవపరీక్ష నిర్వహిస్తామని సీబీఐ కోర్టుకు విన్నవించింది. దర్యాప్తులో భాగంగా మరోసారి శవపరీక్ష నిర్వహించాలని వైద్య బోర్డు సూచించిందని సీబీఐ కోర్టుకు తెలిపింది. దీనిపై న్యాయస్థానం నిర్ణయం వెలువడాల్సి ఉంది.