: తెలంగాణాలో ఈ ఏడాది బస్సు ఛార్జీల పెంపు లేదు
ఈ ఏడాది బస్ ఛార్జీలను పెంచడం లేదని తెలంగాణ రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో రవాణా సౌకర్యాలని మరింత మెరుగుపరుస్తామని ఆయన అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా బస్సు సౌకర్యం లేని 1300 కుగ్రామాలను గుర్తించామని... ఈ గ్రామాలకు త్వరలోనే బస్సులు నడుపుతామని ఆయన వెల్లడించారు. త్వరలో హైదరాబాదులో 80 కోట్ల రూపాయలతో 80 కొత్త బస్సులను కొనుగోలు చేస్తున్నామని మహేందర్ రెడ్డి అన్నారు.