: పోలవరం నిర్వాసితుల కోసం 3,200 కోట్లు కేటాయించిన ఏపీ సర్కార్


పోలవరం ప్రాజెక్ట్ ద్వారా నిర్వాసితులవుతున్న గిరిజన ప్రజల పునరావాసం కోసం 3,200 కోట్ల రూపాయలను కేటాయించినట్టు ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ తెలిపారు. పునరావాసం విషయంలో నిర్వాసితులతో చర్చించి నిర్ణయం తీసకుంటామన్నారు. పునరావాస చర్యల్లో వారికి కూడా భాగస్వామ్యం కల్పిస్తామని దేవినేని ఉమ వెల్లడించారు. ఛత్తీస్ గఢ్, ఒడిశా ప్రభుత్వాల సహకారంతో పోలవరం ప్రాజెక్ట్ ను త్వరితగతిన పూర్తి చేస్తామని ఆయన అన్నారు. ప్రాజెక్ట్ చుట్టూ రక్షణ గోడల ఏర్పాటు ద్వారా ముంపు ప్రాంతాన్ని తగ్గిస్తామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News