: ‘పశ్చిమ’లో చంద్రబాబు పర్యటన సాగిందిలా!


పశ్చిమ గోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రెండో రోజు పర్యటన ఉత్సాహంగా సాగింది. నర్సన్నపేట, సీతంపేట, బయ్యన్నగూడెం, కొయ్యలగూడెం, గవరవరం, పొంగుటూరు గ్రామాల మీదుగా బాబు రోడ్ షో సాగింది. ఈ సందర్భంగా కొయ్యలగూడెంలోని పొగాకు వేలం కేంద్రాన్ని బాబు సందర్శించారు. ఈ సందర్భంగా ఈ-ఆక్షన్ విధానాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఆరేపాటి దిబ్బలు వద్ద డ్వాక్రా సంఘాల మహిళలతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి వెంట మంత్రి పీతల సుజాత, పొగాకు బోర్డు ఛైర్మన్ గోపాల్, పలువురు నాయకులు, ఎమ్మెల్యేలు ఉన్నారు.

  • Loading...

More Telugu News