: ఆర్థిక వ్యవస్థనే శాసించగల శక్తి డ్వాక్రా సంఘాలకు ఉంది: చంద్రబాబు


పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు డ్వాక్రా సంఘాలతో సమావేశమయ్యారు. ఆరేపాటిదిబ్బలు వద్ద ఆయన మాట్లాడుతూ... ఆనాడు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డ్వాక్రా మహిళలు చదువుకోవాలని చెప్పానన్నారు. డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలు పిల్లలను స్కూలుకు పంపుతున్నారని, వారి కృషి వల్లే అక్షరాస్యత పెరిగిందనీ అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఈ సందర్భంగా బాబు ఆకాంక్షించారు. జనాభా నియంత్రణ ఘనత డ్వాక్రా సంఘాల మహిళలదేనని అన్నారు. డ్వాక్రా సంఘాలు ఆర్థికంగా ఇంకా అభివృద్ధి చెందాలన్నారు. ఆర్థిక వ్యవస్థనే శాసించగల శక్తి డ్వాక్రా మహిళలకు ఉందని ఆయన అన్నారు. మన సంఘాలు ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయన్నారు.

  • Loading...

More Telugu News