: ముంబైలో గ్యాస్ లీక్: తక్షణ చర్యలతో తప్పిన ముప్పు


ముంబై నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతమైన వర్లీలో గురువారం మధ్యాహ్నం గ్యాస్ లీకైన ఘటన చోటుచేసుకుంది. అయితే గ్యాస్ పైపులైన్ సిబ్బంది అప్రమత్తతతో ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదు. వివరాల్లోకెళితే... ముంబై నగరంలో సీఎన్జీతో పాటు పీఎన్జీ గ్యాస్ సరఫరా బాధ్యతలు తీసుకున్న మహానగర్ గ్యాస్ లిమిటెడ్ పలు ప్రాంతాల్లో పైపు లైన్లు వేసింది. గురువారం 2 గంటల ప్రాంతంలో వర్లీ పరిసరాల్లోని నాకా ప్రాంతంలోని ఓ పెట్రోల్ పంపు వద్ద పైపు లైన్ నుంచి గ్యాస్ లీకవుతున్న విషయాన్ని స్థానికులు గుర్తించారు. అదే సమయంలో పైపులైను సిబ్బంది కూడా దీనికి సంబంధించిన అలారంతో అప్రమత్తమయ్యారు. తక్షణమే రంగంలోకి దిగిన ఎంజీఎల్ సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం చేరవేయడంతో పాటు పాడైన పైపుకు మరమ్మతులు చేపట్టారు. సకాలంలో స్పందించిన నేపథ్యంలో ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోకపోవడంతో ముంబై వాసులు ఊపిరి పీల్చుకున్నారు.

  • Loading...

More Telugu News