: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
ప్రతిష్ఠాత్మక లార్డ్స్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్టుకు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా ట్రెంట్ బ్రిడ్జ్ లో జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. పేస్ దాడే లక్ష్యంగా ఇంగ్లండ్ జట్టు బరిలో దిగనుండగా... బ్యాటింగ్, బౌలింగ్ లో సత్తా చాటాలని ధోనీ సేన కృతనిశ్చయంతో ఉంది. కాగా, పిచ్ తొలి రోజు పేసర్లకు సహకరిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మూడో రోజు నుంచి బౌలర్లకు సహకరించడం మానేసి బ్యాట్స్ మన్ కు స్వర్గధామంగా మారుతుందని పేర్కొంటున్నారు.