: శ్రీకూర్మనాథుడి మూలవిరాట్ తస్కరణ యత్నం?
ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన శ్రీకాకుళం జిల్లా శ్రీ కూర్మంలో అపచారం జరిగింది. అర్చకుడు కూర్మనాథుడి మూల విరాట్ కొలతలను లక్క రూపంలో సేకరించి ఒక భక్తుడికి ఇచ్చినట్లు సమాచారం. ఇది బయటకు పొక్కడంతో భక్తులు అర్చకులపై రాళ్లదాడి చేశారు. ప్రధానార్చకుడు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఈవోను సస్పెండ్ చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవలే శ్రీకూర్మ క్షేత్రంపై రూపొందించిన పోస్టల్ స్టాంప్ ను కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి విడుదల చేసిన సంగతి తెలిసిందే. అంతలోనే ఈ ఘటన జరగడం అప్రతిష్ఠాకరం. అయితే, స్వామికి వెండితొడుగు ఇచ్చేందుకు ఒక భక్తుడు అచ్చు కావాలని కోరినట్లుగా అర్చకులు చెబుతున్నారు. కానీ, ఈ కొలతలతో మూలవిరాట్ నకిలీది తయారు చేసి అసలుది విక్రయించే యత్నంగా భక్తులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఆలయం వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది.