: తెలంగాణలో ‘హరితహారం’ చేపడతాం: జోగు రామన్న


తెలంగాణలో ‘హరితహారం’ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు రాష్ట్ర మంత్రి జోగు రామన్న తెలిపారు. దీనిలో భాగంగా ఇంటికో మొక్క నాటేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లోనూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడతామని మంత్రి చెప్పారు. అటవీభూములపై సర్వే చేసి సరిహద్దులు నిర్ణయిస్తామని ఆయన అన్నారు. అటవీ భూములను పరిరక్షించేందుకు స్పెషల్ ఫోర్స్ ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News