: ఇవాళ 16 అక్రమ కట్టడాలను కూల్చేశాం: జీహెచ్ఎంసీ
హైదరాబాదులో ఇవాళ జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 16 అక్రమ కట్టడాలను కూల్చివేశామని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. దీంతో, ఇప్పటివరకు 41 అక్రమ కట్టడాలను తొలగించినట్లయింది. అక్రమ కట్టడాల కూల్చివేతకు నిరసనగా జీహెచ్ఎంసీ మేయర్ ఛాంబర్ ఎదుట టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. ఇవాళ నగరంలోని దిల్ సుఖ్ నగర్, బీఎన్ రెడ్డి నగర్, కర్మాన్ ఘాట్ ప్రాంతాల్లో నిర్మాణ దశలో ఉన్న కట్టడాలను మున్సిపల్ సిబ్బంది నేలమట్టం చేశారు. మధురానగర్, కూకట్ పల్లిలోని భవనాలనూ కూల్చివేశారు. రాంనగర్ లో మూడంతస్తుల భవనం, సికింద్రాబాదులో నాలుగంతస్తుల భవనాన్ని నేలమట్టం చేశారు. సికింద్రాబాదులోని మహంకాళీ దేవాలయం సమీపంలోని ఓ భవనాన్ని కూడా అధికారులు కూల్చివేశారు.