: సీఎం సీటుకోసం కుమ్ములాడుకున్నారు తప్ప పార్టీని పట్టించుకోలేదు: టీకాంగ్ నేతలు


తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. గాంధీ భవన్ లో జరిగిన సమావేశంలో ఎవరికి వారుగా సీనియర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన పార్టీగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి గుర్తింపు ఉన్నప్పటికీ దానిని ఓట్ల రూపంలోకి మార్చేందుకు సీనియర్లు చిత్తశుద్ధితో ప్రయత్నించలేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు సీఎం కుర్చీ కోసం లాబీయింగ్ పై దృష్టిపెట్టారే తప్ప పార్టీని పట్టించుకున్న పాపానపోలేదని అన్నారు. సాక్షాత్తూ సోనియా సభ విఫలం అవ్వడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ సీనియర్ నేతలు, మాజీ మంత్రులేనని వారు మండిపడ్డారు. గత వైఫల్యాల నుంచి గుణపాఠాలు నేర్చుకోలేదని, పొన్నాలను పీసీసీ పీఠం నుంచి దించే ప్రయత్నాలే తప్ప పార్టీని క్షేత్రస్థాయిలో పటిష్ఠం చేసే ఆలోచన చేయడం లేదని వారు ఆక్షేపించారు. సమష్టి నాయకత్వంతో ముందుకెళ్తే పార్టీ పునర్వైభవం సాధిస్తుందని వారు సూచించారు.

  • Loading...

More Telugu News