: కాబూల్ ఎయిర్ పోర్టుపై దాడి మా పనే: తాలిబాన్ల ప్రకటన
ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ లోని అంతర్జాతీయ విమానాశ్రయంపై ఈ ఉదయం మిలిటెంట్లు విరుచుకుపడడం తెలిసిందే. రాకెట్లు, తుపాకుల మోతలతో ఎయిర్ పోర్టు ప్రాంతం హోరెత్తిపోయింది. కాగా, ఈ దాడి తమ పనే అంటూ తాలిబాన్లు ప్రకటించుకున్నారు. తమ మిలిటెంట్లు ఈ ఉదయం భారీ, తేలికపాటి ఆయుధాలతో కాబూల్ ఎయిర్ పోర్టుపై దాడికి దిగారని తాలిబాన్ ప్రతినిధి జబీయుల్లా ముజాహిద్ ఓ ప్రకటనలో తెలిపారు.