: మూడోరోజు అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రారంభం
హైదరాబాదులో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని ఎల్బీనగర్ లో ఐదంతస్తుల భవనాన్ని కూల్చివేస్తున్నారు. అటు దిల్ సుఖ్ నగర్, బీఎన్ రెడ్డి నగర్, సరూర్ నగర్, ఏఎస్ రావ్ నగర్ లోని అక్రమ కట్టడాలను కూడా అధికారులు కూల్చివేస్తున్నారు. పోలీసుల భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు జరుగుతున్నాయి. మరోవైపు కూల్చివేతలు ఆపాలంటూ స్థానికులు ఆందోళనకు దిగారు.