: కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి
ఛత్తీస్ గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఏర్పడిన అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర తీరం వెంబడి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీసే అవకాశం ఉంది. కోస్తాంధ్ర, తెలంగాణల్లో పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.