: కేంద్రం సంస్కృత భాష వారోత్సవాల ప్రకటనపై వైగో అభ్యంతరం
దేశంలోని సీబీఎస్ఈ పాఠశాలల్లో వారం రోజుల పాటు సంస్కృత భాషా ఉత్సవాలు జరపాలని కేంద్రం నిర్ణయించడం పట్ల ఎండీఎంకే నేత వైగో అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవలం ఒక్క భాషనే అభివృద్ధి చేయరాదని, అది జాతీయ సమగ్రతను దెబ్బతీస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. పాఠశాలల్లో సంస్కృత భాష వారోత్సవాలు నిర్వహించాలని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఇటీవలే ఆదేశాలు జారీచేశారు.